ఒకే సమయంలో రన్‌వే పై రెండు విమానాలు

Two planes on the runway at the same time– ముంబయిలో తప్పిన ప్రమాదం
– ఎటిసిఒపై వేటు
ముంబయి : ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ఎయిర్‌ ఇండియా 657 విమానం ఇంకా టేకాఫ్‌ ప్రక్రియలో ఉండగానే ఇండిగో 5053 అదే రన్‌వే దిగింది. రెండింటికి మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు విమానాలు ఒకే రన్‌వేపై ప్రయాణించడం.. ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్‌ అవుతుండగా.. అదే సమయంలో ఎయిర్‌ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు గాల్లోకి ఎగిరడం వీడియోల్లో స్పష్టంగా ఉంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) విమానాశ్రయానికి చెందిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌ (ఎటిసిఒ)ను విధులను నుంచి తప్పించింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్త్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. తమ పైలట్‌ ముంబయి ఎయిర్‌ పోర్టు ఏటీసీ సూచనలను తూచా తప్పకుండా పాటించాడని పేర్కొంది. ”జూన్‌ 8వ తేదీన ఇండిగో 6ఈ6053 విమానానికి ఏటీసీ నుంచి ల్యాండింగ్‌ క్లియరెన్స్‌ లభించింది. మాకు ప్రయాణికుల సురక్షితే ముఖ్యం. ప్రొసిజర్‌ ప్రకారం ఈ ఘటనపై మేం రిపోర్టు చేశాం” అని ఒక ప్రకటనలో వెల్లడించింది.

Spread the love