నవతెలంగాణ – హైదరాబాద్ : నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ఎసీపీ కె.హనుమంతరావు, సీఐ ఎం.సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైనా చర్యలు తీసుకుంటారని సమాచారం. కాగా నిన్న ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.