రెండు ప్రయివేటు బస్సులు ఢీ..ఐదుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ :  తమిళనాడు రాష్ట్రం కుడ్డలోర్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెల్‌పటమ్‌పక్కమ్ ప్రాంతంలో రెండు ప్రయివేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 65 మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయ కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love