రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
రోడ్డు ప్రమాదానికి ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మండలంలోని దురద పాడు కు చెందిన బంధం సారయ్య, బంధం వెంకటేష్ ఏపీలోని ఏలూరుజిల్లా కుక్కునూరు మండలం దాచారం లో గల తమ బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో అశ్వారావుపేట మండలంలోని కుడుములపాడు సమీపంలో అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేశారు. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్.హెచ్.ఒ, ఎస్ ఐ శ్రీరాముల శ్రీను ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love