జ‌మ్మూక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌ ఇద్ద‌రు సైనికులు మృతి

నవతెలంగాణ – శ్రీన‌గ‌ర్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని కిష్ట‌వార్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో వైపు క‌థువాలో జ‌రిగిన మ‌రో ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను రైజింగ్ స్టార్ కార్ప్స్ హ‌త‌మార్చారు. కిష్ట‌వార్‌లో ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ స‌మాచారం వ‌చ్చింద‌ని, దాని ఆధారంగా చాట్రూ ప్రాంతంలో ఆప‌రేష‌న్ చేప‌ట్టామ‌ని, 15.30 నిమిషాల స‌మ‌యంలో ఉగ్ర‌వాదుల ఆచూకీ చిక్కింద‌ని, ఆ స‌మ‌యంలో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఇద్ద‌రు సైనికులు మ‌ర‌ణించిన‌ట్లు ఆర్మీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్ర‌స్తుతం అక్క‌డ కూంబింగ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ట్లు ఆర్మీ వెల్ల‌డించింది. కిష్ట‌వార్ ఎన్‌కౌంట‌ర్‌లో పాల్గొన్న ఉగ్ర‌వాదులే జూలైలో దోడాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో పాల్గొన్నారు. అక్క‌డ జ‌రిగిన ఎదురుకాల్పుల్లో న‌లుగురు సైనికులు మృతిచెందిన విష‌యం తెలిసిందే.

Spread the love