అమెరికాలోని సరస్సులో మునిగి ఇద్దరు తెలుగు చిన్నారులు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌ లోని ఓ సరస్సులో మునిగి ఎవాంజెలిన్‌ గాలి (4), సెలాహ్‌ గ్రేస్‌ గాలి (2) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గత శనివారం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగి రాకపోవడంతో తల్లి సుధ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరి ఇంటికి సమీపంలోని సరస్సులో బాలికల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీసా సమస్యతో పిల్లల తండ్రి డేవిడ్ ఇండియాలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Spread the love