రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..ఇరువురికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ-ఆర్మూర్ : మండలంలోని పి ఫ్రీ గ్రామ శివారులోని ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.. మంగళవారం సాయంత్రం మండలంలోని మంతిని గ్రామానికి చెందిన నర్సారెడ్డి పట్టణంలో పనులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టగా, నర్సారెడ్డి కాళ్లు, తల చాతి భాగాలకు తీవ్ర గాయాలు కాగా పట్టణంలో ఒక ప్రైవేటుకు ఆసుపత్రికి తరలించినారు. పి ఫ్రీ నుండి ఆర్మూర్ కు వస్తున్న గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడికి కాళ్లకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Spread the love