బండ్లగూడలో కారు బీభత్సం..ఇద్దరు మహిళలు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్‌ వాక్‌కు వెళ్తున్న ముగ్గురిని బండ్లగూడ జాగీర్‌ సన్‌ సిటీ వద్ద కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love