
దేవగిరి ఎక్సప్రెస్ సోమవారం సాయంత్రం 4:30 నిజామాబాద్ నుండి ముంబయికి బాసర స్టేషన్ వద్ద ఎస్6 కొచ్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక రెండేళ్ళ బాబును వదిలి వెళ్లారని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి మంగళవారం తెలియజేశారు. రైల్వే సిబ్బంది అతని ఏడుపును గమనించి అతని వాళ్ళు ఎవరైనా ఉన్నారని మొత్తం కోచులు అన్నీ బాబును చూయిస్తూ వెతికినా .. అందరూ బాబు గురించి తెలియదు అని చెప్పారు. వెంటనే బాబును నిజామాబాద్ కు తీసుక వచ్చి బాసర స్టేషన్ మాస్టర్ ఇచ్చిన మెసేజ్ ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనంతరం బాబును చైల్డ్ వెల్ఫేర్ నిజామాబాద్ వారికి అప్పగించారు. ఈ ఫోటో లో ఉన్న బాబును ఎవరైనా గుర్తిస్తే రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి నెంబర్ 8712658591 కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.