మిచాంగ్ తుఫాన్ ముంచుకాస్తుంది..

– అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి
– మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ మల్హర్ రావు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పడిందని, ఈ ఎఫెక్ట్ తో రాష్ట్రం లో సోమవారం నుండి మంథని నియోజకవర్గంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశించారు.ఈ సంద మంగళవారం మాట్లాడారు ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గోదావరి,మానేరు తీరాల ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని,అధికార యంత్రాంగం ఎలాంటి నష్టాలు జరగకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతుకు ఆదైర్య పడవద్దు కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తో పాటు ఇతర పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలందరినీ ఎప్పటికప్పుడు అధికారాలు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

Spread the love