ప్రతిదాడికి ఉక్రెయిన్‌ సర్వసన్నద్ధం అమెరికా సైనికాధికారి

న్యూయార్క్‌ : రష్యా మీద ఎప్పటి నుంచో జరగనున్నదని చెబుతున్న ప్రతిదాడికి ఉక్రెయిన్‌ సర్వసన్నద్ధంగా ఉందని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌, మార్క్‌ మిల్లే మంగళవారం సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థకు చెప్పారు. అదే రోజు ఉక్రెయిన్‌ సైన్యం రష్యన్‌ దళాల మీద చేసిన దాడిలో ఘోరంగా నష్టపోయింది. ఈ ప్రతిదాడి తన లక్ష్యాలను సాధి ంచగలదా అనే విషయం గురించి ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నాడు. సైనిక శిక్షణ, ఆయుధాలు,సైనిక నిపుణుల సలహాలు, గూఢచర్యం తదిత ర అంశాలను ఉక్రెయిన్‌కు పశ్చి మదేశాలు అందిస్తున్నాయి. రష్యా దళా లు ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌ ప్రాం తాలను తిరిగి స్వాధీనం చేసుకోవటా నికి ఆ దేశం సన్నద్దమైందని మిల్లే అన్నారు. తమ సైన్యం ప్రతి దాడికి సిద్దంగా ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, వ్లాడీమీర్‌ జెలెన్‌ స్కీ ఎన్నో సార్లు ప్రక టించారు. అయితే ఆయన తిరిగి తన కు మరింత సమయం, మరిన్ని ఆయు ధాలు కావాలని చెబుతూ వచ్చాడు. ఈ సన్నద్ద కాలంలో ఉక్రె యిన్‌ బాక్మత్‌ నగరంలో రష్యాతో చేసిన యుద్ధంలో దాదాపు 50,000 మంది సైనికులను కోల్పోయింది. మరోవైపు యావత్‌ ఉక్రె యిన్‌లోని ఆయుధగారాలపై, కమాం డ్‌ కేంద్రాలపై రష్యా మిసైళ్లను, డ్రోన్ల నుపయోగించి బీభత్సం సృష్టిస్తున్నది. బాక్మత్‌ యుద్ధంలో జరిగిన నష్టం ఉక్రె యిన్‌ ఆత్మ విశ్వాసాన్ని బాగా దెబ్బ తీ సింది. ఈ నేపథ్యంలో ఆదివారం మొ దలైన ప్రతిదాడిలో ఆరు మెకనైజ్డ్‌, రెండు ట్యాంకు బెటాలియ న్లతోపాటు డోనెస్క్‌ సరిహద్దులోని ఐదు విభాగా లు పాల్గొన్నాయి. ఈ ప్రతిదాడిని వా యుసేన దాడులతోను, ఫిరంగుల కాల్పులతోను రష్యన్‌ సైన్యం తిప్పి కొ ట్టింది. రష్యా సైనిక ప్రతి ఘటనతో ఉక్రెయిన్‌ దళాలు తీవ్రంగా నష్టపో యాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 900 మంది సైనికులను, 16 ట్యాంకులను, 33 సాయుధ శకటా లను ఉక్రెయిన్‌ కోల్పోయిందని రష్యా తెలిపింది. సైనికంగా క్రైమియాను తిరిగి స్వాధీనం చేసుకోవటం తోపాటు ఉక్రెయిన్‌ తన లక్ష్యాలను చేరుకోలేదని మిల్లే గతంలో అనేక సార్లు ప్రకటిం చాడు. మంగళవారం సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘ఏమి జరగను న్నదో చెప్పటం తొందర పాటు అవుతు ంది’ అని మార్క్‌ మిల్లే అన్నాడు.

Spread the love