నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రస్తుతం కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా మామన్నన్. ఈ మూవీ పై అందరిలో మొదటి నుండి మంచి అంచనాలు ఉన్నాయి. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా నేడు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానుంది. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఎం షెంగాబాగ్ మూర్తి, ఆర్ అర్జున్ దురై నిర్మించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.