నవతెలంగాణ-మల్హర్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష పేపర్లలో మల్హర్ మండలం (అప్పటి తాడిచర్ల) మండల పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగిన బెల్లంకొండ మల్హార్‌రావు నక్సలైట్ల చేతిలో హత్య చేయచేబడ్డాడు. ఈ ఘటనపై గ్రూపు ప్రశ్న పత్రంలో నక్సలైట్ ఉద్యమకాలం నాటి ముఖ్య ఘటనలు అనే ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఇవ్వగా ‘తాడిచర్ల మండల అధ్యక్షుడు మల్హార్‌రావు హత్య’ అని అడిగారు. మల్హార్‌రావు నక్సలైట్ల చేతిలో 1989లో హత్యకు గురయ్యాడు.
కొయ్యుర్ ఎదురు కాల్పులపై ప్రశ్న
దీంతో పాటు మరో ప్రశ్న ‘నక్సలైట్లపై జరిగిన ఎదురు కాల్పులను కాలక్రమానుసారంగా అమర్చండి అని అడిగారు. ఈ ఎదురు కాల్పులు 1999లో 25ఏండ్ల కిందట జరిగాయి. ఇందులో నక్సలైట్ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి,ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శీలం నరేష్, పశువుల కాపరి లక్ష్మీరాజాం అమరలయ్యారు. మల్హార్‌రావు హత్య, నక్సలైట్ల ఎదురు కాల్పల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించడం విశేషం. నాటి సంఘటనలు గ్రూప్-2 పరీక్ష పత్రాల్లో రావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు