ఘనంగా ఉక్కు సత్యాగ్రహం ట్రైలర్‌, పాటలు ఆవిష్కరణ

ఘనంగా ఉక్కు సత్యాగ్రహం ట్రైలర్‌, పాటలు ఆవిష్కరణసత్యారెడ్డి నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ఈ సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన, ఎమ్మెల్యే ధర్మశ్రీ, గద్దర్‌ వెన్నెల, ఫిలిం ఛాంబర్‌ మాజీ చైర్మన్‌ బివి రెడ్డి, పారిశ్రామికవేత్త రాజీవ్‌, ప్రొడ్యూసర్‌ దాసరి కిరణణ్‌, గాయని ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గద్దర్‌ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ, ‘మా నాన్న గద్దర్‌ ప్రజల కోసం ఎంతో పాటు పడేవారు. ఆయన రాసిన పాటలు, గేయాలు ..అన్ని ప్రజల కోసం, ప్రజల సమస్యల మీదనే ఉండేవి. కరోనా సమయంలో కూడా ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కోసం ఎంతో సేవ చేశారు అలాగే వారి సమస్యలను ఉద్దేశిస్తూ ఎన్నో పాటలను కూడా ఆయన రాసి, పాడారు. అలాగే ప్రజా సమస్యల పైన పోరాడే చిత్రాల్లో ఎక్కువగా నటించిన నాన్న ఈ సినిమాలోనూ పాటలు రాయడంతోపాటు నటించారు’ అని తెలిపారు.
‘ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం గద్దర్‌. ఆయన నాకు తండ్రితో సమానం. ఆయన ఈ రోజున మన మధ్య లేక పోవడం చాలా బాధాకరం. అయితే ఆయన కూతురు వెన్నెలని ఆయన రూపంలో మాకు బహుమతిగా అందించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబం ధించిన సమస్యల్ని తెలియజేస్తూ ఈ సినిమా తీశాం’ అని దర్శకుడు సత్యా రెడ్డి చెప్పారు.
ఈచిత్రానికి సంగీతం : కోటి, ఎడిటర్‌ : మేనగ శ్రీను, కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం : పి.సత్యా రెడ్డి.

Spread the love