ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా ఉండటం రష్యాకు ‘మౌలికావసరం’

నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరటం రష్యా జాతీయ భద్రత అస్థిత్వానికి ప్రమాదకరమని, అటువంటి చర్యను రష్యా సహించబోదని అధ్యక్షుడుమాస్కో :నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరటం రష్యా జాతీయ భద్రత అస్థిత్వానికి ప్రమాదకరమని, అటువంటి చర్యను రష్యా సహించబోదని అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌ సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ సమావేశంలో పాల్గొన్న ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు చెప్పారు. సోవియట్‌ యూనియన్‌ నుంచి ఉక్రెయిన్‌ విడిపోయేముందు ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా ఉంటుందని స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగిందని పుతిన్‌ ఆఫ్రికన్‌ దేశాల ప్రతినిధులకు గుర్తుచేశారు.
1990లో సోవియట్‌ ఉక్రెయిన్‌ సార్వభౌమ రాజ్యంగా ప్రకటింపబడినప్పుడు ఉక్రెయిన్‌ ‘శాశ్వతంగా తటస్థ దేశంగా కొనసాగుంతుంది’ అని ప్రకటించటం జరిగింది. ఈ ప్రకటన ప్రాముఖ్యత రష్యాకు చాలావుంది. ఉక్రెయిన్‌ ను నాటో కూటమిలో చేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో తమకు అర్థం కావటంలేదని, కానీ దానితో రష్యా భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడుతందని పుతిన్‌ అన్నారు. రష్యాకు వ్యతిరేకమైన సైనిక కూటమికి చెందిన సైన్యం రష్యా సరిహద్దులలో మోహరించబడే సాధ్యతను రష్యా ఏమాత్రం ఆమోదించటం లేదు.
సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లో 49ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్న రష్యా-ఆఫ్రిగా సదస్సు తరువాత ఉక్రెయిన్‌ యుద్ధం గురించి చర్చించటానికి ఆఫ్రికా శాంతి మిషన్‌ సభ్యులతో పుతిన్‌ సమావేశమయ్యారు. రష్యా శాంతి చర్చలకు సంసిద్దంగా ఉండగా, ఉక్రెయిన్‌ రష్యాతో చర్చలు జరపటాన్నే నిషేధిస్తూ చట్టం చేసింది. అంతకు ముందు2022 మార్చిలో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ లో చేసుకున్న ఒప్పందాన్ని పక్కన బెట్టిందని ఆఫ్రికా శాంతి మిషన్‌ సభ్యులకు పుతిన్‌ చెప్పారు. టర్కీలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్‌ తటస్థ దేశంగా ఉండటానికి అంగీకరించింది. భారీ ఆయుధాలపైన పరిమితిని విధించుకునేందుకు ఉక్రెయిన్‌ సిద్దపడింది. ఆ తరువాత అలా చేసుకున్న ప్రాథమిక ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఘర్షణ మొదలవటానికి ప్రధాన కారణం 2014లో ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్నిరష్యాకు అనుకూలంగా ఉన్నదన్న ఈర్ష్యవల్ల అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ప్రభుత్వాల ‘క్రియాశీల మద్దతు’తో ఒక ‘రాజ్యాంగ వ్యతిరేక, సాయుధ తిరుగుబాటు’తో కూలదోయటాన్ని కారణంగా చెప్పవచ్చు. ఆ తరువాత రష్యా రిఫరెండంను నిర్వహించి క్రైమియాను తనలో కలుపుకుంది. ఒడెస్సా, ఖార్కోవ్‌ లలో నిరసనలను ఉక్రెయిన్‌ సైన్యంతోను, జాతీయవాద సాయుధ దళాలతో అణచివేసింది. కానీ డోనెస్క్‌, లుగాన్స్క్‌ లు ప్రతిఘటించి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. ఆ తరువాత 2015లో మిన్స్క్‌ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ప్రకారం ఈ రెండు ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి ఆధారంగా తిరిగి ఉక్రెయిన్‌ లో చేరటానికి అంగీకరించాయి. కానీ ఉక్రెయిన్‌ ఈ ఒప్పందాలను అసలు అమలు చేయలేదు. ఉక్రెయిన్‌ ను సైనికంగా బలోపేతం చేసి రష్యాతో యుద్ధానికి సంసిద్దంచేసేందుకోసం పశ్చిమ దేశాలు ఈ ఒప్పందాలను అమలుచేయకుండా కావాలనే కాలయాపన చేసినట్టు మాజీ జర్మన్‌ నాయకురాలు అంజెలా మెర్కెల్‌ గత డెసెంబర్‌ లో గుట్టువిప్పింది. మాజీ ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాంకో హౌల్లాండ్‌ ఈ విషయాన్ని నిజమేనని ద్రువీకరించారు.
ఏడు ఆఫ్రికా దేశాధినేతల చొరవతో ఉక్రెయిన్‌ లో శాంతి స్థాపన కోసం చేసిన ప్రయత్నాలను రష్యా అభినందించినప్పటికీ ఉక్రెయిన్‌ ముందస్తు షరతుల కారణంగా అది ముందుకు సాగటంలేదు.

Spread the love