పెద్దపల్లి జిల్లా కోకో సంఘం నూతన కార్యవర్గo ఏకగ్రీవ ఎన్నిక..

నవతెలంగాణ – మంథని
పెద్దపెల్లి జిల్లా కోకో అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆదివారం మంథనిలోని ఫ్రెండ్స్ క్లబ్ లో రాష్ట్ర కోకో సంఘం ఉపాధ్యక్షులు మహేందర్ రావు అధ్యక్షతన నిర్వహించినారు. ఈ సమావేశంలో నూతన పెద్దపల్లి జిల్లా కోకో అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నికలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొని జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దపల్లి జిల్లా కోకో సంఘం అధ్యక్షునిగా టీ.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల కుమారస్వామి, కోశాధికారిగా ఈ నరేష్ లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు అధికారికంగా న్యాయవాది కన్నూరి శ్రీహరివ్యవహరించగా పరిశీలకులుగా శ్యాం ప్రసాద్, లక్ష్మణ్, సురేష్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కోకో సభ్యులు కె సదానందం, సూర్యప్రకాష్, వి రవీందర్, కట్టసతీష్, జలంధర్, తిరుపతి, ప్రభాకర్, యుగంధర్, శ్రీనివాస్ తదితల్లి పాల్గొన్నారు.
Spread the love