నవతెలంగాణ- మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలములోని అవాల్గవ్ గ్రామనికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందీ. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలు, అలాగే సంక్షేమ పథకాలు, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధినీ చూసి, వారు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందీ. ఎమ్మెల్యే హనమంత్ షిండే చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ బన్సి పటేల్ గారు, మద్నూర్ సర్పంచ్ సురేష్, సర్పంచ్ గాఫర్, అవాల్గావ్ సర్పంచ్ శంతేశ్వర్, అవ్లగవ్ ఎంపీటీసీ సాయిలు, ఉప సర్పంచ్ మారుతి, అవాల్గావ గ్రామ పార్టీ అధ్యక్షులు నగేష్, విజయ్ కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, యువ కార్యకర్తలు పాల్గొన్నారు.