మోడీ హయాంలో ధరల మంట, నిరుద్యోగం, అవినీతి

మోడీ హయాంలో
ధరల మంట, నిరుద్యోగం, అవినీతి– పృధ్వీరాజ్‌ చవాన్‌
ముంబయి: ఎన్నికల ప్రచారంలో మోడీ అంతా తానై వ్యవహరిస్తూ పార్టీలో ప్రముఖ నేతలను సైతం పక్కనపెట్టారని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత పృధ్వీరాజ్‌ చవాన్‌ అన్నారు. తాము తొలుత బీజేపీ బలమైన పార్టీ అని, అధికారం, ధనబలం ఉన్న పార్టీగా భావించా మని చవాన్‌ చెప్పుకొచ్చారు. మోడీ చరిష్మా ఆ పార్టీకి కలిసొస్తుందని అనుకున్నామని అన్నారు. అయితే మోడీ తానే సర్వస్వంగా నియంతత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం, మోడీ వ్యవహార శైలి, రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం, ఎన్నికల బాండ్లు, అవినీతి ప్రధాన పాత్ర పోషిస్తాయని చవాన్‌ వెల్లడించారు. ఎన్నికల బాండ్లతో ప్రధాని నగదురహిత అవినీతి వ్యవస్ధను ప్రవేశపెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తూ, పలు పార్టీలను చీల్చుతూ మోడీ అనైతిక, రాజకీయ అవినీతికి తెరలేపారని ఆరోపించారు.

Spread the love