నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద నివాసం ఉండే ఓ వృద్ధురాలికి రక్షిత ఫౌండేషన్ అండగా నిలిచి వృద్ధురాలికి గ్యాస్ పొయ్యి అందజేశారు. ఈ మేరకు శనివారం రైల్వే కమాన్ వద్ద నివాసం ఉండే బాలుడికి మతి స్థిమితం సరిగ్గా లేదని తల్లి, తండ్రి వదిలేయటం తో అన్ని తానై ఓ వృద్ధురాలు చూసుకుంటుంది. వృద్ధురాలినీ కలిసి ఏమైనా సహాయం కావాలా అని అక్షిత ఫౌండేషన్ సభ్యులు అడిగారు. వండుకోటానికి ఏమి లేవు ఒక గ్యాస్ పొయ్యి కావాలని చెప్పడంతో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా గ్యాస్ పొయ్యి ఆ వృద్దిరాలికి అందజేశారు. ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇప్పించేందుకు అండగా ఉంటామని వ్యవస్థాపక అధ్యక్షులు – అక్షిత ఫౌండేషన్ సన్నీ రాపాక తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాలతో పాటు నిరుపేదలకు అవసరమగు ఇంటి సామాను ఇవ్వడం జరిగిందని రాబోవు రోజుల్లో మరెన్నో కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో చేసేందుకు ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.