– అన్నీ రంగాలు కుదేలు :తోట
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వైసీపీ అసమర్థ పాలనలో అన్నీ రంగాలు కుదేలై రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయిందని బీఆర్‌ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో ఆయన వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగలో హిందూ, ముస్లిం సోదరులు పాల్గొని తమ ఐక్యతను చాటారని కొనియాడారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లి దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలుగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.