అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో బీజేపీలో భారీగా చేరికలు 

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున  బీజేపీలో చేరారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం లోని రుద్రాంగి మండలం మానాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు బిజెపిలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏలేటి అన్నపూర్ణమ్మను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు యువకులు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు గంగా నర్సయ్య, గంగాధర్, దేవేందర్, తూం రమేష్, రవీందర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love