నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆమెకు దక్కనుంది. ఈ క్రమంలో ఆమె మొరార్జీ దేశాయ్ (6) రికార్డును బ్రేక్ చేయనున్నారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం మొరార్జీ దేశాయ్ (10) పేరు మీదనే ఉంది.