మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

నవతెలంగాణ – ఢిల్లీ: లోక్ సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్‌ను నిర్ధారించే బిల్లుకు నేటి సాయంత్రం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా కేబినెట్ సమావేశం తర్వాత ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు మీడియాకు చెబుతారు. కానీ ఈ రోజు కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించకపోవడంతో… మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ బిల్లు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చారిత్రక నిర్ణయాలు తీసుకుంటారని ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు తొలుత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చడం వంటి అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందా? తెలియాల్సి ఉంది.

Spread the love