రాజ్యాంగంపై చర్చ.. తేదీలను ప్రకటించిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే వారం రాజ్యాంగంపై చర్చకు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ అంగీకరించారు. ఇవాళ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం రాజ్యాంగంపై చర్చ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ప్రకటించారు. లోక్‌సభలో డిసెంబర్‌ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. చర్చ అనంతరం రాజ్యాంగంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నట్లు తెలిసింది.

Spread the love