ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan-Reddyనవతెలంగాణ-హైదరాబాద్ : ఏప్రిల్ మెుదటి వారం లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విజయ సంకల్ప యాత్ర రోడ్ షో సందర్బంగా వారసి గూడా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో అవీనితిరహిత ,శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుంది. ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది అని తెలిపారు.

Spread the love