యూనిక్‌ కథ

యూనిక్‌ కథహీరో అల్లరి నరేష్‌ తన 63వ చిత్రాన్ని ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ దర్శకుడు సుబ్బు మంగాదేవితో చేస్తున్నారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం. 4. ఈ చిత్రానికి ‘బచ్చల మల్లి’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ పెట్టారు. ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేయగా, దర్శకుడు అనిల్‌ రావిపూడి క్లాప్‌ ఇచ్చారు. విజరు కనకమేడల తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని మారుతీ, బుచ్చిబాబు మేకర్స్‌కి అందజేశారు. అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ వీడియో సూచించినట్లుగా, న్యూ -ఏజ్‌ యాక్షన్‌ డ్రామాగా యూనిక్‌ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లరి నరేష్‌ ఇంటెన్సివ్‌ రోల్‌ ప్లే చేయబోతున్నారు. ఇందులో ఆయనకు జోడిగా అమత అయ్యర్‌ కథానాయికగా నటించనుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోయే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో స్టార్ట్‌ కానుంది.

Spread the love