కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన ఐక్యవిద్యార్థి, యువజన సంఘాలు

నవతెలంగాణ హైదరాబాద్‌: నీట్‌ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి, యువజన సంఘాలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద కలిసే ప్రయత్నం చేశారు. కానీ, కేంద్రమంత్రి వారిని కలిసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో ఆయన ఇంటి ముందు దర్నాకు దిగారు. ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కోట రమేష్, ఎ.వెంకటేష్, ఎస్.ఎఫ్.ఐ నాయకులు రజనీకాంత్, ఎ.ఐ.ఎస్.ఎఫ్  నేత పుట్టా లక్ష్మణ్ పీ.డి.ఎస్.యూ నాయకులు కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Spread the love