
నవతెలంగాణ డిచ్ పల్లి : ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల ద్వారా నూతన రకాల వ్యాపారల యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అడిషనల్ డిఅర్డిఓ పిడి చందర్ నాయక్ అన్నారు. ఇందూరు జిల్లా మహిళ పరస్పర సహకార సమాఖ్య 70వ కార్యవర్గ సమావేశం సోమవారం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు విప్లవ కుమారి అధ్యక్షతన డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనత పుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఅర్డిఓ మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం. (2021-22)లో బ్యాంకింగ్ కేజీలు మంచి ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిజామాబాద్ జిల్లా నిలచి అవార్డు కుడా రావడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో కుడా బ్యాంకు లింకేజి లక్ష్యం సాధించడానికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల ద్వారా నూతన రకాల వ్యాపారాల యూనిట్లను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. రానున్న రోజుల్లో జిల్లా సమాఖ్య ద్వారా పప్పుదినుసుల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. స్వయం సహాయక గ్రామ సంఘాలు, మండల సమాఖ్య లు కుడా సబ్సిడీ రుణాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు, యూనిట్ ల ఏర్పాటు కోరకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో అడిషనల్ డిఅర్డిఓ మధుసూదన్, స్త్రీ నీది అర్ఎం రాందాస్ , డిపిఎం లు ఎన్.శ్రీనివాస్, సంధ్యారాణి, సాయిలు, నీలిమ, మారుతి, కోశాధికారి నవత, కార్యదర్శి లక్ష్మీ, సిబిఓ ఆడిటర్లు, జిల్లా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.