– ప్రముఖ సినీ నిర్మాత ఆర్ నారాయణ మూర్తి…
నవతెలంగాణ డిచ్ పల్లి : ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, సహజనటుడు ,దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తెలంగాణ యూనివర్సిటీ నుంచి మంగళవారం సందర్శించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి తో యూనివర్సిటీ లో ఉండే సమస్యలను పరిష్కార మార్గాలను చర్చించారు.విశ్వవిద్యాలయాలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయని విశ్వవిద్యాలయ విద్యను సమాజంలో అట్టడుగు వర్గాలకు అందించాలని తాను నిర్మిస్తున్న యూనివర్సిటీ అనే చిత్రానికి విశ్వవిద్యాలయాల సమస్యలు భూమికగా ఉండ బోతున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు సమాజంలో వచ్చే అనేక మార్పులకు, మౌలిక సమస్యలకు పరిష్కారం చూపే కేంద్రాలుగా విలసిల్లాలని సందేశాత్మకంగా చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నారాయణ మూర్తి వేల్లడించారు.ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులను కలిసి ఆర్. నారాయణ మూర్తి తనదైన శైలిలో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్.యం. యాదగిరి ఆధ్వర్యంలో ఉద్యోగస్తులందరూ ఆర్ నారాయణ మూర్తి ని శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు