యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి..

 – పి.డి.ఎస్.యూ..
నవతెలంగాణ- డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని  పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ నాలుగు రోజులుగా చేస్తున్న నిరసనలకు పి.డి.ఎస్.యూ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తమకు అనుకూలంగా పని చేసే ఉద్యోగస్తులను రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుందని , ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలకు ఇష్టానుసారం గాజీతాలు పెంచుకుంటున్నారని, యూనివర్సిటీ  విషయానికి వస్తే ఏలాంటి సమస్యలను పరిష్కరించడం లేదన్కానారు. యూనివర్సిటీ విద్యార్థుల కోసం నిరంతరం పని చేస్తున్న కార్మికులని పట్టించుకోక పోవటం దారుణమని, పని చేస్తున్న కార్మికులకు పనికి సమనవేతనం ఇవ్వాలని , అందరిని పర్మినెంట్ చేయాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు పవన్, రవీందర్, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.
Spread the love