సార్వత్రికంలో కనపడని స్థానబలం..

Created with GIMP

– స్వంత గ్రామాల్లోనూ సత్తా చాట లేని స్వతంత్రులు…

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎన్నిక ఏదైన గెలిచే అభ్యర్థి కోసం పార్టీలు, గెలిపించే పార్టీ కోసం అభ్యర్ధులు ఆసక్తి చూపడం సర్వసాధారణం. ఫలానా అభ్యర్థిని ఫలానా చోట నిలబెడితే స్థాన బలిమితో గెలవవచ్చునని ఓ పార్టీ.. ఏ సామాజిక వర్గానికి బలముందో ఆ కులానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టడం రాజకీయ ప్రతివ్యూహాల్లో భాగమే. కాని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సొంత గ్రామంలో ఓట్లు వేయించు కో లేని వారు,స్వతంత్రంగా నిలబడినా సత్తా చాట లేక పోవడం రుజువై పోయింది. దీంతో రాజకీయ గాలి, ధన ప్రభావం తప్ప సామాజిక వర్గాలు, స్థాన బలిమి పనిచేయదు అనేది ప్రస్తుత ఫలితాలను బట్టి తెలుస్తోంది.
అశ్వారావుపేట నియోజకవర్గం స్థానికి 14 మంది బరిలో నిలిచారు.ఇందులో కనీసం ముగ్గురు మధ్యనే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఫలితాలను బట్టి చూస్తే ఇద్దరి మధ్యే నువ్వా నేనా అనే పోటీ నెలకొంది. ప్రతీ రౌండ్ లోనూ, ప్రతీ పోలింగ్ కేంద్రంలోనూ కాంగ్రెస్ అభ్యర్ధి జారే ఆదినారాయణ, బీఆర్ఎస్ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు మధ్యనే హోరా హోరీ ఓట్ల పోరు సాగింది.
చివరికి జారే ఆదినారాయణ 74,993 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఎమ్మెల్యేగా రెండో సారి బరిలోకి దిగిన మెచ్చా నాగేశ్వరరావు 46,088 ఓట్లుతో రెండో స్థానంలో నిలిచి మాజీ ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార ప్రతి పక్షాలు ప్రచారం, ప్రసారం, ఆర్ధికం దుర్వినియోగం చేసారని సామాన్యుడు సైతం చర్చించుకుంటున్నారు.
స్వతంత్రులు ఒకరిద్దరు సైతం ఈ సారి ప్రధాన అభ్యర్ధులతో పోటీ పడి వ్యయం చేసినప్పటి వారి వారి స్వగ్రామంలో సైతం స్వంత వారి మద్దతు కూడకట్ట లేకపోవడం విచారకరం.
 ఈ ఫలితాలను బట్టి స్థాన బలిమి కాని, వర్గ పొందిక గాని, ఓట్ల రూపేణ రాజకీయ పార్టీలకు లబ్ది చేకూర్చలేదని అర్ధమవుతుంది. ఎంత ప్రజాసేవలో నిమగ్నమైనప్పటికీ ఎన్నికల సమయంలో ఉన్న రాజకీయ వాతావరణం ప్రలోభాల పరవాలే ఓట్లు రాలుస్తాయనడానికి ఓ నిదర్శనంగా తెలుస్తోంది.
ప్రస్తుతం పోటీ పడ్డ 14 మంది అభ్యర్ధులకు వారి గ్రామాల్లో ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూస్తే ధన వినిమయ రాజకీయంలో రక్త సంబంధీకులు సైతం ఓట్లు వేయరు అనే సత్యం రుజువు అవుతుంది.
సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల తన ఓటు హక్కు ఉన్న అశ్వారావుపేట పోలింగ్ కేంద్రం నెంబర్ 161లో మొత్తం ఓట్లు 895 ఉండగా 644 పోల్ అయినవి. ఈ పోలింగ్ కేంద్రంలో అర్జున్ రావు పిట్టలకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆదినారాయణ జారే 375, మెచ్చా నాగేశ్వరరావు 198 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్ధులకు రెండు అంకెలు మించని ఓట్లు మాత్రమే వచ్చాయి. అర్జున్ రావు పిట్టల స్వంత మండలం దమ్మపేటలోని స్వగ్రామం ముకుందా పురంలోని పోలింగ్ కేంద్రం 87లో మొత్తం ఓట్లు 1070 కాగా 1020 ఓట్లు పోల్ అయినవి. ఇందులో అర్జున్ రావు పిట్టల 19, ఆదినారాయణ జారే కు 654, మెచ్చా నాగేశ్వరరావుకు 302 ఓట్లు వచ్చాయి. మిగత అభ్యర్ధులకు ఒకటీ అరా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆదినారాయణ జారే స్వంత మండలం దమ్మపేటలోని స్వగ్రామం గండుగులపల్లి పోలింగ్ కేంద్రం 82 లో మొత్తం ఓట్లు 957 కాగా పోలైన ఓట్లు 849. ఇందులో
ఆదినారాయణ జారేకు 614, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు 187 వచ్చినవి. మిగత వారి ఓట్లు అంతంత మాత్రమే.
జాతీయ పార్టీ అభ్యర్ధిగా బీఎస్పీ నుండి మడకం ప్రసాద్ పోటీ చేసారు. ఈయన స్వంత గ్రామం అశ్వారావుపేట మండలం నందిపాడు, పోలింగ్ కేంద్రం 140 లో మొత్తం 1169 ఓట్లు ఉండగా
పోలైన ఓట్లు 1069. ఈయనకు 34 ఓట్లు రాగా, ఆదినారాయణ కు 407, మెచ్చాకు 280
అర్జున్ రావుకు  223 ఓట్లు పడ్డాయి.
ఎమ్మెల్యేగా రెండో సారి బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్ధి మెచ్చా నాగేశ్వరరావు
స్వగ్రామం దమ్మపేట మండలం, తాటి సుబ్బన్న గూడెం 107 పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు  440 ఉండగా 393 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ‌ఈయనకు 230 ఓట్లు రాగా, ఆదినారాయణ జారే కు 138 ఓట్లు వచ్చాయి.
గోండ్వోనా దండకారణ్య పార్టీ అభ్యర్ధిగా ఊకే రవి స్వగ్రామం చౌటు గూడెం, ములకలపల్లి మండలం 14 పోలింగ్ కేంద్రంలో మొత్తం ఓట్లు 728 కాగా పోలైన ఓట్లు 689. ఇందులో ఊకే రవికి 70 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆదినారాయణకు 301, మెచ్చాకు 211 ఓట్లు వచ్చాయి.
గోండ్వోనా గణతంత్ర పార్టీ అభ్యర్ధిగా నాలుగో సారి పోటీ చేసిన కన్నె బోయిన వెంకట నర్సయ్య
స్వగ్రామం ములకలపల్లి మండలం, ములకలపల్లి పోలింగ్ కేంద్రం 12లో మొత్తం ఓట్లు 905. పోలైన ఓట్లు 763. స్వంత ఊరిలో ఈయనకు వచ్చిన ఓట్లు 8 మాత్రమే. ఆదినారాయణ జారే       483, మెచ్చా నాగేశ్వరరావు 204 ఓట్లు వచ్చాయి.
ఎలైన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్ధి పద్దం వెంకట రమణ స్వగ్రామం యర్ర గుంట, మండలం అన్నపురెడ్డి పల్లి పోలింగ్ కేంద్రం  67లో  మొత్తం ఓట్లు 1061 ఉండగా
పోలైన ఓట్లు 855. ఈమెకు వచ్చిన ఓట్లు 15 మాత్రమే. ఆదినారాయణ జారే  463, మెచ్చా నాగేశ్వరరావు 291 ఓట్లు వచ్చాయి.
భారతీయ చైతన్య యువజన పార్టీ అభ్యర్ధి,చిట్టి తల్లి సేవా సమితి పేరుతో ఉచిత అంబులెన్స్ సర్వీస్ యజమాని, నారం వారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం స్వగ్రామం నారంవారిగూడెం, మండలం అశ్వారావుపేట, పోలింగ్ కేంద్రం152లో మొత్తం ఓట్లు 1097. పోలైన ఓట్లు 1013. ఈయనకు వచ్చిన ఓట్లు 175 మాత్రమే. ఆదినారాయణ జారేకు 516, మెచ్చా నాగేశ్వరరావు 245 ఓట్లు వచ్చాయి.
జాతీయ పార్టీ బీజేపీ బలపరిచిన, జనసేన అభ్యర్ధి ముయ్యబోయిన ఉమాదేవి
స్వగ్రామం దమ్మపేట మండలం, పట్వారిగూడెం పోలింగ్ కేంద్రం 126లో మొత్తం ఓట్లు 845. పోలైన ఓట్లు 768. ఈమెకు వచ్చిన ఓట్లు 15 మాత్రమే. ఆదినారాయణ జారే కు 422, మెచ్చా నాగేశ్వరరావు 297 ఓట్లు వచ్చాయి. మూడో సారి స్వతంత్ర అభ్యర్ధి గా పోటీచేసిన ఆంగోతు క్రిష్ణ స్వగ్రామం నాగుపల్లి, మండలం దమ్మపేట, పోలింగ్ కేంద్రం నెంబర్ 85లో మొత్తం ఓట్లు 1178 కాగా పోలైన ఓట్లు 967. ఈయనకు వచ్చిన ఓట్లు మూడు అంటే మూడు మాత్రమే. ఆదినారాయణ జారే కు 676, మెచ్చా నాగేశ్వరరావు  252 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధి ఊకే ముక్తేశ్వర రావు స్వగ్రామం తొట్టి పెంపు, మండలం అన్నపురెడ్డి పల్లి, పోలింగ్ కేంద్రం నెంబర్ 81లో మొత్తం ఓట్లు 648 కాగా, పోలైన ఓట్లు 571. ఈయనకు వచ్చిన ఓట్లు ఎనిమిది మాత్రమే.ఆదినారాయణ జారే కు 298, మెచ్చా నాగేశ్వరరావు 197 ఓట్లు వచ్చాయి.
సీపీఐ ఎంఎల్ ఎన్ డి ప్రజా పంథా అభ్యర్ధిగా పోటీ పడిన కిషోర్ కల్లూరి స్వగ్రామం ముత్యాలమ్మ పాడు,మండలం ములకలపల్లి, పోలింగ్ కేంద్రం నెంబర్ 17లో మొత్తం ఓట్లు 838 ఉండగా పోలైన ఓట్లు 764.ఇందులో ఈయనకు వచ్చిన ఓట్లు 84 మాత్రమే.ఆదినారాయణ జారే కు 298,మెచ్చా నాగేశ్వరరావు 263 ఓట్లు వచ్చాయి.
స్వతంత్ర అభ్యర్ధి కుంజా నాగమణి స్వగ్రామం నాగు పల్లి, మండలం దమ్మపేట, పోలింగ్ కేంద్రం నెంబర్ 86లో  మొత్తం ఓట్లు 1199 ఉండగా పోలైన ఓట్లు 998. ఈమెకు వచ్చిన ఓట్లు మూడు అంటే మూడే ఓట్లు అంటే ఆశ్చర్యం మే మరి.ఆదినారాయణ జారే కు 778,మెచ్చా నాగేశ్వరరావు కు 169 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్ధి తంబళ్ళ రవి, స్వగ్రామం ఏన్కూరు, మండలం  ఏన్కూరు.
దమ్మపేట మండలం,పోలింగ్ కేంద్రం నెంబర్ 113 లో ఈయన ఓటు హక్కు కలిగి ఉన్నాడు.ఈ కేంద్రంలో ఈయనకు ఆరు ఓట్లు అంటే ఆరే వచ్చాయి.ఈయన ప్రముఖ ఆర్.ఎం.పి వైద్యులు కూడా. ఈ కేంద్రంలోమొత్తం ఓట్లు 890 ఉండగా, పోలైన ఓట్లు 728.ఆదినారాయణ జారే కు     458 రాగా, మెచ్చా నాగేశ్వరరావు కు 222 ఓట్లు వచ్చాయి.
Spread the love