మేడారం కాలి నడకన వెళుతున్న రవళి రెడ్డికి అపూర్వ స్వాగతం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మేడారం మొక్కులు తీర్చడానికి కాలినడకన గట్టమ్మ వద్ద నుండి బయలుదేరిన టీపీసీసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి కి మండలంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు గణ స్వాగతం పలికారు. మంగళవారం సీతక్క  అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే గట్టమ్మ వద్ద నుండి కాలినడకన మేడారం వనదేవతలను సందర్శిస్థానని ప్రత్యేక మొక్కులు చెల్లిస్తానని ములుగు నుండి బయలుదేరిన రవళి రెడ్డి సాయంత్రం మండల కేంద్రానికి చేరుకున్నారు. కాలి నడకన గోవిందరావుపేట మండలానికి చేరిన రవళి రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు  కార్యకర్తలు స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి పూలమాలలు  శాలువా తో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మహిళా కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు సునీత, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చొప్పదండి వసంత, ఎంపీటీసీ చాపల ఉమాదేవి, సామ శ్రీలత, తోకల అహల్య, గోపిదాసు వజ్రమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love