మణిపూర్‌లో ఆగని హింస

మణిపూర్‌లో హింసాకాండ
మణిపూర్‌లో హింసాకాండ

నవతెలంగాణ ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. తాజాగా మళ్లీ రాష్ట్రంలో హింసాకాండ చెలరేగింది. సోమవారం వెస్ట్‌ కాంగ్‌పోక్పి జిల్లా జరిగిన హింసాకాండలో ఒక పోలీసు మృతి చెందగా, 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం జిల్లాలోనికంగ్‌చుప్‌ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను, కొండలను లక్ష్యంగా చేసుకుని సాయుధ దుండగులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. ఈ ఘటన కాకుండా రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో సోమవారం హింసాకాండ జరిగినట్టు వార్తలు వస్తునాుయి. అయితే వీటిలో చోటు చేసుకును నష్టం గురించి ఇంకా వార్తలు రాలేదు. మే 3 నుంచి మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభయింది. ఇప్పటి వరకూ 150 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇంకా సహాయక శిబిరాలు, కొండల్లో తలదాచుకుంటున్నారు.
శాంతిభద్రతల బాధ్యత ప్రభుత్వానిదే..: సుప్రీం
మణిపూర్‌లో శాంతిభద్రతల బాధ్యత అక్కడ ఎన్నికైన ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రత బాధ్యతను తాము అమలు చేయలేమని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిత్యావసర వస్తువుల రవాణాకు అతి కీలకమైన మణిపూర్‌ జాతీయ రహదారిని స్థానికులు దిగ్భంధనం చేయకుండా చూసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని మణిపూర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటీషన్‌ విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే అసోసియేషన్‌ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసింది. అలాగే పోలీస్‌ స్టేషన్ల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంపై స్టేటస్‌ రిపోర్టు దాఖలు చేయాలనిమణిపూర్‌ ప్రధాన కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Spread the love