– యూఎస్ పీసీ నాయకులు హతిరామ్, రాంబాబు
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీ, ధర్నాను స్థానిక ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయాలని ఆళ్ళపల్లి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ) మండల నాయకులు ఇస్లావత్ హతిరామ్(టీఎస్ యుటిఎఫ్), జోగా రాంబాబు(టీపీటీఎఫ్) సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ఇపీ, ఎన్ పీఎస్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని, ఐటీ మినహాయింపు పరిమితిని పెంచాలని తెలిపారు. రూ.398 స్పెషల్ టీచర్ సర్వీసుకు పీఆర్ సీ కమిటీ వేయాలని కోరారు. గత జులై 1వ తేదీ నుంచి ఐఆర్ మంజూరు చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఆ వ్యవస్థను రద్దు చేయాలని పేర్కొన్నారు. 317జి.ఓ బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. సీఎం హామీ మేరకు 5571 పిఎస్ హెచ్ ఎం పోస్టులు మంజూరు చేయాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని తెలిపారు. 2024, సెప్టెంబర్ కు ముందే నియామక ప్రక్రియ పూర్తి అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ సత్వరమే చెల్లించాలని, పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు.