ఎంఎస్‌ఎంఇలకు అన్‌సెక్యూర్డ్‌ రుణాలు

గోద్రేజ్‌ క్యాపిటల్‌ వెల్లడి
హైదరాబాద్‌ : గోద్రెజ్‌ గ్రూప్‌ ఆర్థిక సేవల విభాగం అయిన గోద్రెజ్‌ క్యాపిటల్‌ కొత్తగా ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అన్‌సెక్యూర్డ్‌ (తనఖా రహిత) బిజినెస్‌ లోన్‌లను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ రంగంలోని వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తూ, గోద్రెజ్‌ క్యాపిటల్‌ వినూత్నమైన, సౌకర్యవంతమైన రీపేమెంట్‌ అవకాశాలతో వారి అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. పూర్తి డిజిటలైజ్డ్‌ ప్రాసెస్‌, వేగవంతంగా మంజూరు చేయటం, రుణాలను అందించటం, 60 నెలల వరకు చెల్లించే అవకాశం, సకాలంలో తిరిగి చెల్లింపులపై పరిశ్రమలో మొట్ట మొదటి రివార్డ్‌ ప్రోగ్రామ్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. తొలుత 31 నగరాల్లో ఈ సేవలు అందించనున్నామని.. అందులో విజయవాడ, రంగారెడ్డి, విశాఖపట్నం, హైదరాబాద్‌ ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది.

Spread the love