అకాల వర్షంతో తడిసి ముద్దయిన వరి ధాన్యం, మక్కలు

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన బస్తాలు
గ్రామాల్లో ధాన్యం ఎగుమతిని పట్టించుకోని
అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-శాయంపేట
రైతులు ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పం టలు సాగుచేసి పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే గన్నీ సం చుల, రవాణా కొరతతో కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం, మక్కలుపేరుకుపోయాయి. మంగళవారం తెల్ల వారుజామున వీచినగాలికి టార్పాలిన్‌ కవర్లు ఎగిరి పోవడం, తర్వాత కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షంతో అన్నదాత అతలాకుత లం కాగా, రైతుల కళ్ళల్లో ధైన్యం కనిపిస్తుంది. మండల పరిధిలోని గ్రామాల్లో 13 వరి ధాన్యం కొనుగో లు కేంద్రాలు, మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏ ర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అనుకూలమైన రైతులకు, బంధువులకు ముందుగా గన్నీ సంచులు ఇస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గన్నీ సంచులు అందజేసినా రవాణా సకాలంలో కాక పోవడంతో 1000 బస్తాల వరకు తూకం వేసి మిన్న కుంటున్నారు. లారీ రవాణా జరిగితేనే మరలా తూ కం వేస్తున్నారు. లారీల కొరతతో కొనుగోలు కేంద్రా లలో వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు నిల్వలు పేరుకు పోయాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వీచిన గాలి దుమారానికి, భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు గత్యంతరం లేక ధాన్యం సంచుల చుట్టూ నీరు జాలు వారకుండా మ ట్టితో కట్టలు కట్టి, నీటిని ఎత్తి పారబోశారు. రవాణా కొరత ఏర్పడుతుందని ఇటీవల ప్రగతి సింగారంలో రైతులు కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యానికి నిప్పు పెట్టినిరసన తెలియజేశారు. అయినప్పటికీ అధికారు ల్లో ఎలాంటి చలనం కానరావడం లేదు. ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు కుదేలవుతు న్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
పర్వతగిరి : మండల కేంద్రంలో మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌ యార్డు లో ఐకెపి కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం తడిసి ముద్దఅయింది. గత వారం రోజుల నుండి కాంటాలు జరగకపోవడంతో కురిసినవర్షానికి తమ ధాన్యం తడి సిపోయిందని రైతులు విలపించారు. ఇప్పటికైనా అధికారులు,ప్రభుత్వం వెంటనే స్పం దించి ధాన్యం కాంటాలయ్యేలాచర్యలు తీసుకో వాలని కోరారు.
దామెర : మండలంలో మంగళవారం ఉద యం ఈదురు గాలితో కూడిన భారీ వర్షం పడడంతో మండలంలోని రైతు పొలాల వద్ద మొక్కజొన్న, వరి ధాన్యం రాశులు తడిసి ముద్దయినాయి .కొనుగోలు కేంద్రాలైన సింగరాజుపల్లి, పసరగొండ కేంద్రాలలో ధాన్యం రాశులు తడిసి నీరు పాలై రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోతూ ఉన్నామని వాపోతున్నారు.
నడికుడ : మండలంలోని ధర్మారం, నర్సక్కప ల్లి, నడికూడ, కౌకొండ, సర్వాపూర్‌, రామకృష్ణాపూర్‌, నర్సక్కపల్లి గ్రామాల్లోని రైతులు అప్పులు తెచ్చి ఆరు గాలం కష్టంచేసి పండించిన పంట వడగండ్ల వానతో నష్టపోయి ఏమితోచని పరిస్థితిలో రైతులు ఉంటే వారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎంతోకొంత చే తికొచ్చిన పంట తడిసి ముద్ద కావడంతో ఏం చేయాలోతోచని పరిస్థితిలో రైతులు ఆందోళన పడుతున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పరదాలు కూడ సమయానికి అందకరైతులు ఆందోళన చెందు తున్నారు. వర్షానికి తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర పెట్టి రైతులను ఆదుకో వాలని రైతులు కోరారు. వర్షానికి నష్ట పోయిన రైతుల పంటకు మద్దతుధర పెట్టి రైతులను ఆదుకో వాలని కోరారు.

Spread the love