గాలివాన బీభత్సం ..

– విరిగిన విద్యుత్ స్తంభాలు
– అందకారంగా మారిన  గ్రామాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల గాలివాన బీభత్సంతో మండలంలోని తాడిచెర్ల,మల్లారం,కొయ్యుర్,పెద్దతూoడ్ల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి,కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో మండలంలోని పలు గ్రామాలు అందకారంగా మారాయి.మల్లారం, చిన్నతూoడీలా గ్రామాల్లో పలు రేకుల ఇండ్లు ధ్వంసమై రేకులు కొట్టుకుపోయాయి. తాడిచెర్ల కొయ్యుర్  ప్రధాన రహదారిపై తాటి,వేప చెట్లు విరిగి పడటంతో రవాణాకు ఆటంకం కలిగింది. కొయ్యుర్, వళ్లెంకుంట, రుద్రారం, తాడిచెర్ల, మల్లారం గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఏసిఎస్, డిసిఎంఎస్ వరిధాన్యం  కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించడానికి పోసిన ధాన్యం కుప్పలు మళ్ళీ తడిసి ముద్దయ్యాయి.దీంతో రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. అకాల గాలివాన బీభత్సంతో ఇండ్లు, పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను,ప్రజలకు ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
Spread the love