నవతెలంగాణ – రామారెడ్డి
శ్రీ స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం నడవాలని సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ శుక్రవారం అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ రామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శ్రీ స్వామి వివేకానంద సమాజానికి ఇచ్చిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఉపాధ్యక్షులు రాంసింగ్, ఎంపీటీసీలు రజిత రాజేందర్ గౌడ్, భాగ్యలక్ష్మి శ్యామ్, మాజీ సర్పంచ్ దండబోయిన సంజీవ్, అమ్ముల శ్రీనివాస్, పటేండ్ల రమేష్ రెడ్డి, బుల్లి రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.