సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇనిషియేటివ్
రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరంతరం ప్రజా సమస్యలపై మాట్లా డుతూ, ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తూ, అభ్యుదయ భావాలు కల్గిన ప్రొఫెసర్ హర గోపాల్‌పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దేశద్రోహం కేసును ఉపసం హరించుకోవాలని సీపీఐ(ఎంఎల్) రెవెల్యూషనరీ ఇనిషియేటివ్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం డిమాండ్ చేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తు న్నామని అన్నారు. ఉపాధి, తాగునీరు, భూ సమస్యలు, దళిత, గిరిజనులపై దాడులు తదితర అంశాలపై హరగోపాల్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వం దష్టికి తెస్తున్నారని గుర్తుచేశారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసాద్‌తో 50 మంది మావోయిస్టులు సమావేశమైనట్లు ప్రభు త్వం ప్రకటించిందని, అందులో హరగోపాల్ కూడ ఉన్నట్టు ప్రకటించడం, వామపక్షవాదులను లక్ష్యంగా చేసుకుని కేసులు బనాయించడం దుర్మార్గమని అన్నారు.