మూడు గంటలు నిలిచిపోనున్న UPI సర్వీసులు..!

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రస్తుతం భారత్ లో క్యాష్ పేమెంట్స్ కంటే ఎక్కువ మంది యూపీఐ పేమెంట్స్ నే వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో మూడు గంటలు UPI సర్వీసులు నిలిచిపోతున్నాయి అంటే ప్రజలకు సమస్య అనే చెప్పాలి. కానీ ఈ సమస్య అందరి కాదు. కేవలం హెచ్ డిఎఫ్సి బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే. రేపు HDFC బ్యాంకు తన యూపీఐ సేవలను ముఫు గంటల పాటు నిలిపివేయనుంది. ఈ ఆగస్టు 10న తమ బ్యాంక్ సిస్టమ్ మెయింటెనెన్స్ వల్ల తమ వినియోగదారులకు మూడు గంటల పాటు యూపీఐ సర్వీస్ అందుబాటులో ఉండటం లేదు అని పేర్కొంది. ఈ మేరకు HDFC ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే వినియోగదారులకు అధిక ఇబ్బంది కలగకుండా ఉండేలా.. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపివేసింది HDFC. అయితే ఆ సమయంఓ ఎక్కువ మంది UPI సేవలు వాడరు అనేది తెలిసిందే.

Spread the love