ఉప్పల్‌ స్టేడియం కరెంటు బిల్లు క్లియర్‌!

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం కరెంటు బిల్లు పెండింగ్‌లను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ క్లియర్‌ చేస్తున్నది. దాదాపు పదేళ్లుగా బకాయి పడ్డ రూ.1.64 కోట్లను విడతల వారీగా చెల్లించేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో ఒప్పందం ప్రకారం మొదటి విడతగా రూ. 15 లక్షలను చెల్లించింది. ఈ 15 లక్షల రూపాయల చెక్కును మంగళవారం టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు చెక్‌ అందజేశారు. ఐపీఎల్‌ సమయంలో కరెంటు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love