నవతెలంగాణ ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(సిఎస్ఈ) 2025 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు నేటి నుంచి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.