ఊరు వాడ జెండా పండుగ వెడుకలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, డిచ్ పల్లి మండల మాజీ బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరి కొండా కృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, మండలంలోని రాంపూర్ డి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ పాపాయి తిరుపతి, ఉప సర్పంచ్ ఎంకన్నోల్ల రమేష్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శక్కరి కొండా కృష్ణ జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రపాలనలో వివక్షకు గురైన రాష్ట్రం, ప్రస్తుతం రాష్ట్రం స్వయం పాలనలో స్వేచ్చగా,ఆత్మ గౌరవంతో ఆనందంగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో తెలంగాణ ఉద్యమ కారుల బలిదానాలనీ, ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని తన వంతుగా అభివృద్ధిలో ముందుకు తీసుకపోతున్న టిఎస్ ఆర్టీసీ చైర్మన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ న్యాయకత్వాన్ని బలపరుస్తూ, వారి అడుగుజాడల్లో నడుస్తూ, తెలంగాణ ఉద్యమ కారులకు, విద్యావంతులకు, నాయకులకు, విద్యార్థులకు, ఈ మహోద్యమంలో పాల్గొన్న తెలంగాణ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులకు,ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి జోహారులు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర జాతిపిత ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో , ప్రజలందరు సుఖసంతోషాలతో, సుభిక్షంగా అబివృద్ది పథంలో ముందుకు సాగాలని శక్కరి కోండ కృష్ణ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగమైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు డిచ్ పల్లి మండల మాజీ బిఅర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరి కొండా కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో నీరడి పద్మారావు, నీరడి దేవరాజ్, నల్లవెల్లి సాయిలు, సీనియర్ నాయకులు విఠల్, అంజయ్య, ఒడ్డేం నర్సయ్య, సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love