ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ & జిల్లా కేంద్ర ఆసుపత్రి నిజామాబాద్ సంయుక్తంగా ఆగస్టు పదహారో తారీఖున 50 సంవత్సరాలు దాటిన వారికీ కాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు దీనిని సీనియర్ సిటిజెన్లు, రిటైర్డ్ ఉద్యోగులు వినియోగించుకోవా లని విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..మగవారికి ,స్త్రీలకు బ్లడ్ టెస్ట్స్ ,అల్ట్రా సౌండ్,ఈ సి జి ,రొమ్ము క్యాన్సర్,గర్భసంచి క్యాన్సర్లకు పరీక్షలు చేస్తారని.ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనిసీనియర్ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ సమాచారం ఇచ్చి ఈ క్యాంపును వినియోగించుకునే విధంగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.క్యాంపు ఇందూరు క్యాన్సర్ హస్పిటల్ మాధవ్ నగర్ నిజామాబాద్ నందు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం అవుతుంది. వేలాది రూపాయల విలువైన స్క్రీనింగ్ టెస్ట్ లు ఉచితంగా చేయబడతాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీమతి డాక్టర్ ప్రతిమా రాజ్, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ గుట్ట శ్రీనివాస్ ,డాక్టర్ సూరి తదితర వైద్య బృందం నేతృత్వంలో ఈ క్యాంపును నిర్వహిస్తారని తెలియజేశారు. ఈవీఎల్ నారాయణ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా,కే రామ్మోహన్రావు జిల్లా అధ్యక్షులు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ వ్యవహరిస్తారన్నారు. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును తీసుకొని రావాలని సూచించారు.