ఉస్తాద్‌.. యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి

Ustad.. Action schedule completeపవన్‌కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఈ సినిమా ప్రస్తుతం యాక్షన్‌-ప్యాక్డ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రానున్న రోజుల్లోనూ ఎగ్జైటింగ్‌ అప్‌డేట్స్‌తో వస్తామని మేకర్స్‌ శనివారం అనౌన్స్‌ చేశారు. వర్క్స్‌ జరుగుతున్న తీరుతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.’గబ్బర్‌ సింగ్‌’ లాంటి సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో పాటు సినిమా గ్లింప్స్‌కి సర్వత్రా అద్భుతమైన స్పందన రావడంతో ఈ సినిమా ఇప్పటికే హ్యూజ్‌ బజ్‌ని క్రియేట్‌ చేసింది. పైగా ఈ సినిమాలోనూ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి పోలీసుగా అలరించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love