ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ హైదరాబాద్‌: రేపటితో తన మొక్కు తీరుతుందని.. ఇక, తన గడ్డం తీసేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలిచి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కువ మెజార్టీతో హుజూర్‌నగర్, కోదాడలో తాము గెలవబోతున్నట్టు చెప్పారు. క్యాంప్ గురించి తపరే తెలియదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాంప్ ఏర్పాటు చేసినా తప్పు లేదని ఉత్తమ్‌ అన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ కే వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినా.. ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు. గెలిచిన అభ్యర్థును జారీ పోకాకుండా చూడాలని.. అవసరమైతే ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ క్యాంప్ కు తరలించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు.. రేవంత్ ఇంటికి వెళ్లి ఫలితాలు, పార్టీ వ్యూహాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 3న ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ నేపథ్యంలో కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ హైదరాబాద్ కు రానున్నారు. కౌంటింగ్ సమయంలో పరిస్థితులను బట్టి కాంగ్రెస్ నేతలు వ్యూహాలు అమలుచేసే అవకాశం ఉంది.

Spread the love