జెఎన్‌ఎఎఫ్‌ఎయులో యుఎక్స్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌

jnfuహైదరాబాద్‌ : జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ (జెఎన్‌ఎఎఫ్‌ఎయు), స్టార్టప్‌ సంస్థ డిజైన్‌ గురు వ్యవస్థాపకులు ప్రవీణ్‌ ఇందూరి రూపొందించిన యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ (యుఎక్స్‌) సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ను జెఎన్‌ఎఎఫ్‌ఎయులో అందించనున్నారు. ఇందుకోసం ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. మంగళవారం మాసబ్‌ ట్యాంక్‌లోని జెఎన్‌ఎఎఫ్‌ఎయు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయినా ప్రవీణ్‌ మాట్లాడుతూ.. ఇది మూడు నెలల వారాంతపు ఆఫ్‌లైన్‌ కోర్సు అని తెలిపారు. ఇది హైబ్రిడ్‌ ప్రోగ్రామ్‌ అన్నారు. విద్యార్థులు, వృత్తి నిపుణులు, డిజైన్‌ ఔత్సాహికులు ప్రవేశం పొందవచ్చన్నారు. ”ఈ కోర్సు డిజైనర్‌లను అనుభవ రూపకర్తలుగా మారుస్తుంది. యుఎక్స్‌ డిజైన్‌ అనేది మానవ సృజనాత్మకత ఉత్పత్తులను రూపొందించే ప్రక్రియ.” అని జెఎన్‌ఎఎఫ్‌ఎయు వైస్‌ ఛాన్సలర్‌, ప్రొఫెసర్‌ ఎన్‌ కవితా దర్యాణి రావు అన్నారు.

Spread the love