యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేయాలి…

– పి.డి.ఎస్.యూ
నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న 200 పీజీ సీట్లను వేంటనే భర్తీ చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కమిటి ఆధ్వర్యంలో పారిపలన భవనం ముందు ధర్నా నిర్వహించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ లో 2023 -24 విద్యా సంవత్సరంలో పిజి అడ్మిషన్లలో తెలంగాణ యూనివర్సిటీ లోని అన్ని కోర్సులలో కలిపి 200 సీట్లు మిగిలిపోయాయని, కొన్ని కోర్స్ లలో సగం సీట్లు మాత్రమే నిండుతున్నాయని దానివలన కోర్సులు ఎత్తివేసే అవకాశం ఉందని, యూనివర్సిటీ లో
ప్రతి ఏటా వందల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయని,స్పాట్ కౌన్సిలింగ్ లేదా మరొక కౌన్సిలింగ్ ద్వారా అయినా పీజీ సీట్లను భర్తీ చేసి గ్రామీణ పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ నాయకులు శివసాయి, ఆకాష్, హన్మాండ్లు, అశ్విత్, తరుణ్, రాము, రాజు, మన్యం కొండ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love