నవతెలంగాణ – ఉప్పునుంతల
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా అచ్చంపేట నల్లమల్ల ముద్దుబిడ్డ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు మంత్రి పదవి ప్రకటించాలని ఉప్పునుంతల మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జి కేశమోని శేఖర్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. మన ప్రాంత వాసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మంత్రి పదవి ప్రకటించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నల్లమల్లను అన్ని విధాలుగా అభివృద్ధి వైపు అడుగులు వెయ్యోచ్చని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు శేఖర్ గౌడ్ కోరారు.