డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ కమాండెంట్ పి. రోహిణి ప్రియదర్శిని ఐపియస్ అద్వర్యంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్, బెటాలియన్ సిబ్బంది బెటాలియన్ అవరణంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిల్లలతో కలసి మొక్కలను నాటారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ కె.పి శరత్ కుమార్, కె.పి సత్యనారయణ, అర్.ఐలు పి. వేంకటేశ్వర్లు, బి. శ్యాంరావు, అర్. ప్రహల్లాద్, బి. వసంత్ రావు, అర్.యస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.